వచ్చేస్తోంది 5G ఇంటర్నెట్… | Good News to Internet Users – 5G internet by 2020 | YOYO TV Channel

వచ్చేస్తోంది 5G ఇంటర్నెట్… | Good News to Internet Users – 5G internet by 2020 | YOYO TV Channel

Please watch: “అఘోరాలు ఎందుకలా మనిషి మాంసం తింటారో తెలుసా? | Bizarre Sex Rituals of Aghori Sadhus | YOYO TV Channel”
https://www.youtube.com/watch?v=NRRyTWu30dc
-~-~~-~~~-~~-~-

వచ్చేస్తోంది 5G ఇంటర్నెట్… #GoodNews to #Internet #Users – #5G internet by 2020

అవును మీరు చదువుతోంది నిజమే..అతి త్వరలో మనకు 5G అందుబాటులోకి రానుంది..అదే జరిగితే మనిషి రోజువారీ జీవితంలో మరిన్ని అద్భుతాలు చోటు చేసుకుంటాయి… విప్లవాత్మక మార్పులు వస్తాయి.. తిరుపతిలో జరుగుతున్న 104వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌లో కొత్త తరం ఇంటర్నెట్‌ వ్యవస్థలైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌, వర్చువలైజేషన్‌, 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌పై రెండు వేరువేరు సదస్సులు జరిగాయి. ఇందులో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ బిశ్వనాథ్‌ ముఖర్జీ, ఎన్‌ఐసీ శాస్త్రవేత్త గోపీనాథ్‌, ఐటీ నిపుణురాలు పమేలా కుమార్‌, ఏరిస్‌ ఇండియా సంస్థ ప్రెసిడెంట్‌ రిషీ భట్నాగర్‌, భబానీ సిన్హా పాల్గొన్నారు.క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థలు ఆటోమేటిగ్గా అప్‌డేట్‌ అవుతాయని ముఖర్జీ పేర్కొన్నారు. ఎక్కడి నుంచైనా కంప్యూటర్‌ వ్యవస్థతో సంధానం కావడం సాధ్యమవుతుందని తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వల్ల మనం ఎంత మేర సేవలు పొందుతున్నామో అంతవరకే రుసుములు చెల్లించడానికి వీలవుతుందన్నారు. ‘వర్చువల్‌ మెషీన్‌ మైగ్రేషన్‌’ కూడా సాధ్యమవుతుందని, దీనివల్ల సంస్థల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. సంస్థలు తమకు అనుకూలమైన చోటుకు కార్యకలాపాలను మళ్లించవచ్చని తెలిపారు. ఉదాహరణకు సదరు సీజన్‌లో విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉండే కాలాన్ని ఎంచుకొని అక్కడికి కార్యకలాపాలను మళ్లిస్తే విద్యుత్‌ ఆదా అవుతుందన్నారు. డిమాండ్‌ను బట్టి విద్యుత్‌ రుసుములు వసూలు చేసే దేశాల్లో ఇది ప్రయోజనమని వివరించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఎంత వరకూ భద్రమన్నదానిపై స్పందిస్తూ.. నిర్దిష్ట భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. 5జీ గురించి వివరిస్తూ అది ఇది 2020కి సాకారం కావచ్చన్నారు. డేటా వేగం వెయ్యి రెట్లు పెరుగుతుందన్నారు. బ్యాటరీ ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుత 4జీతో బ్యాటరీ ఎక్కువగా వినియోగమవుతోందని, దీనివల్ల రోజుకు రెండుసార్లు ఛార్జింగ్‌ చేయాల్సి వస్తోందన్నారు. 5జీ వస్తే అది తొలగిపోయి బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుందన్నారు.

Follow Us on:
Facebok: http://bit.ly/2hkcu66
Google+: https://goo.gl/kSHwBJ
Twitter: https://twitter.com/YOYOTVChannel
Website: http://yoyoiptv.com/

2,887
Like
Save

Comments

Sadhan S says:

me bonda

Comments are disabled for this post.